పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చాలా సినిమాలు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకుడిగా కూడా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతూ ఉండటంతో చిత్రాలను పక్కన పెట్టి మరి ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. దాంతో ఆయనకు అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు అలాగే డేట్స్ కోసం ఎదురు చూస్తున్న దర్శకులు ఎన్నో ఇబ్బందులను పడుతున్నారు. అయితే తాజాగా ఆయన తన కోసం వేచి ఉన్న దర్శక నిర్మాతలకు తమ సినిమాలను చేయడం లేదు అని చెప్పి వారికి విముక్తి కలిగించాడు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఒకే ఒక్క సినిమాను పూర్తి చేస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా హరిహర వీరమల్లు సినిమాను తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో తెరకుక్కుతున్న సినిమా కావడంతో దీనిపై అందరిలో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ టీజర్ కూడా విడుదల అయ్యింది.

ఆ విధంగా సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రేక్షకులను ఈ చిత్రం తప్పకుండా అలరించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా చాలా రోజులుగా ఈ సినిమా యొక్క షూటింగ్ మళ్లీ మొదలవుతుంది అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈసారి వచ్చే షెడ్యూల్ లో పవన్ ఈ సినిమాను ముగిస్తాడా అనేది చూడాలి. రీ ఎంట్రీ లో ఇప్పటిదాకా రెండు సినిమాలతో అలరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ మూడవ సినిమా తర్వాత సినిమాలను చేస్తాడో లేదో అన్న అనుమానాలను కలిగిస్తూ ఆయన అభిమానులు నిరాశ పడుతున్నారు. ఇకపోతే అయన రీ ఎంట్రీ లో రెండు సినిమాలను చేశారు. ఒకటి వకీల్ సాబ్ కాగా, ఇంకొకటి భీమ్లా నాయక్ సినిమా. ఈ రెండు సినిమా లు కూడా ప్రేక్షకులను ఎంతో అలరించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: