టాలీవుడ్  సూపర్  స్టార్  మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే సినిమా ఆఫ్రికా ఖండం నేపథ్యంలో ఒక భారీ సాహసంతో కూడిన థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వచ్చాయి.అయితే దీనిపై దర్శకుడు రాజమౌళిసినిమా కథ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమాను భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు రాజమౌళి ఎన్నో సార్లు చెప్పారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఈ వార్తను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.ప్రస్తుతం రాజమౌళి తన పూర్తి సమయాన్ని మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసమే కేటాయించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ విషయమై తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో డిస్కషన్స్ పూర్తి చేసి ఒక రూపుని తీసుకొచ్చారు.ఈ సినిమా ఇండియానా జోన్స్ దేశీ వెర్షన్ గా ఉంటుందని అలాగే ఈ సినిమాకి సంబంధించిన పనులు 2 నెలల క్రితమే స్టార్ట్ అయ్యాయాని అందుకే రాజమౌళి చాలా బిజీగా వున్నాడని సమాచారం తెలుస్తుంది.


సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.ఈ సినిమాని గ్లోబల్ ట్రాట్టింగ్ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందించబోతున్నట్టు చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు మాములుగా లేవు.ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కనీ వినీ ఎరుగని రీతిలో చాలా గ్రాండ్ గా ఇంకా అలాగే అంతకుమించి రెట్టింపు అంచనాలతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం మహేష్  తన మిత్రుడు  త్రివిక్రమ్ తో చాలా గ్యాప్  తరువాత సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా ఎన్నో భారీ అంచనాలు వున్నాయి. కానీ ప్రస్తుతం మహేష్ కి వున్న పరిస్థితిలు వల్ల ఈ సినిమా షూటింగ్  వాయిదా పడుతూ వుంది.ఒకే సంవత్సరంలో వెంట వెంటనే అన్న రమేష్ బాబు గారు, తల్లి ఇందిరా దేవి గారు, తండ్రి సూపర్  స్టార్ కృష్ణ గారు చనిపోవడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: