అందాల ముద్దుగుమ్మ కియరా అద్వానీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక హిందీ మూవీ లలో నటించి ఎన్నో విజయాలను బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం హిందీ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగిస్తుంది. కియరా అద్వానీ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

మూవీ మంచి విజయం సాధించడం తో ఈ ముద్దు గుమ్మ కు మంచి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లభించింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గ నటించింది. కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతుంది. 

ఇలా వరస సినిమాలతో ఫుల్ జోష్ లో ముందుకు దూసుకుపోతున్న కియరా అద్వానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటో లలో ఈ హాట్ బ్యూటీ వైట్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: