జబర్దస్ కామెడీ షోతో పాపులర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ షో వల్ల వచ్చిన గుర్తింపుతో సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు కొందరు. వీరిలో రామ్ ప్రసాద్ కూడా ఒకరు. తన పంచులతో కడుపుబ్బా నవ్వించే రామ్ ప్రసాద్ ను అందరు ram PRASAD' target='_blank' title='ఆటో రామ్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆటో రామ్ ప్రసాద్ అంటుంటారు. స్టేజ్ పైన రామ్ ప్రసాద్ చేసే కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురు మంచి మిత్రులు. ఈ ముగ్గురు కలిసి త్రీ మంకీస్ అనే సినిమా కూడా చేశారు. అలాగే ఈ ముగ్గురు విడివిడిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు. ఇక ఇటీవలే సుధీర్ గాలోడు అనే సినిమా చేశాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పలు ఏరియాల్లో సుధీర్ కు ఉన్న క్రేజ్ కారణంగా డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు, సక్సెస్ మీట్ సమయంలో రామ్ ప్రసాద్ కనిపించలేదు.

ఇటీవల జరిగిన గాలోడు మూవీ ఈవెంట్ లో స్టేజ్ పైనే రామ్ ప్రసాద్ కు ఫోన్ చేయగా ఆయన సుధీర్ కు ఆల్ ది బెస్ట్ తెలిపాడు. అయితే రామ్ ప్రసాద్ ఎందుకు రాలేదు. ఆయనకు ఏమైంది అన్న ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫొటోల్లో రామ్ ప్రసాద్ తలకు ఏందో కవర్ తొడుక్కొని కనిపించాడు. దాంతో అతని తలకు ఎదో సర్జరీ అయ్యిందని తెలుస్తోంది. అయితే ఆ సర్జరీ దేనికి సంబంధించిందని మాత్రం తెలియడంలేదు. అయితే గతంలో గెటప్ శ్రీను మాట్లాడుతూ..రాంప్రసాద్ హెడ్ కి సర్జరీ చేయించుకోవడం వల్ల సుధీర్ సినిమా ఈవెంట్స్ కు రాలేకపోయాడు అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: