టాలీవుడ్ లో శుక్రవారం వస్తోంది.. అంటే చిన్న పెద్ద సినిమాలతో తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లు కళకళలాడుతుంటాయి. అయితే కొన్ని సార్లు ఎన్నో అంచనాలతో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా బొక్క బోర్లా పడుతుంటాయి. మరికొన్ని సార్లు చిన్న సినిమాలుగా విడుదలయ్యి భారీ హిట్ ను సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా ఈ శుక్రవారం కూడా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడానికి వచ్చేస్తున్నాయి. అయితే రెండు సినిమాల మధ్యన మంచి పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. తమిళ హీరో మరియు బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాల భర్త విష్ణు విశాల్ హీరోగా మరియు ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్న ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించారు.
ఒక చిన్న కథ కుస్తీ ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని అల్లుకున్న చక్కని ప్రేమకథతో ఈ శుక్రవారం మన ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాను చెల్ల అయ్యావు డైరెక్టర్ గా వ్యవహరించారు. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజసినిమా నిర్మాణంలో పలు పంచుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలు మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని అంచనాలను ఒక స్థాయిలో పెంచాయి అని చెప్పాలి.

 ఇక తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమా "హిట్ ది సెకండ్ కేస్". ఇందులో అడవి శేష్ హీరోగా నటించగా , మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేసింది. ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ తో భారీ సక్సెస్ ను అందుకున్న శైలేష్ కొలను... దానికి సీక్వెల్ గా దీనిని ఎంతో పకడ్బందీగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ మూవీ పట్ల అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా డిసెంబర్ 2 న థియేటర్ లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. రెండు విభిన్న సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న టాలీవుడ్ హీరోలు రవితేజ మరియు నానీలు సక్సెస్ అందుకుంటారా ? ఏ మేరకు హిట్ ను మట్టి కుస్తీ సినిమా ఎదుర్కొంటుంది అన్నది చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: