ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఓవర్ నైట్ లోనే ఆయనకు స్టార్ ఇమేజ్ ను తెచ్చి పెట్టిన ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా ఎంత పాపులాటిని దక్కించుకుంది అంటే యూఎస్ఏ లో కూడా వన్ మిలియన్ డాలర్ మార్క్ ను దాటి "ఏ సర్టిఫికెట్" పొందిన తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది అర్జున్ రెడ్డి. అయితే ఇప్పటివరకు ఆ సినిమా మార్కును మరే తెలుగు సినిమా కూడా బ్రేక్ చేయలేదని చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ సినిమా మార్కును బ్రేక్ చేయడానికి అడవి శేష్ హిట్ -2 తో సిద్ధమవుతున్నాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా యూఎస్ఏ లో ఈ సినిమాకు భారీ రేంజ్ లో మార్కెట్ జరిగిందట. ఈ క్రమంలోనే అక్కడ ఏకంగా 450 స్క్రీన్ లలో సినిమా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు దీన్ని బట్టి చూస్తే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.  మొత్తానికైతే అడవి శేష్.. తన సినిమాతో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా మార్కును బ్రేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒక యంగ్ హీరో టార్గెట్ ను మరో యంగ్ హీరో బ్రేక్ చేస్తూ ఉండడం పై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషలలో విడుదలవుతున్న ఈ సినిమా హిందీలో వాయిదాపడినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు గల  క్లారిటీ రాలేదు కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం హిందీ వర్షన్ సినిమాను కొంతకాలం వాయిదా వేయబోతున్నారు.  హిట్ -2 సినిమా తర్వాత త్వరలోనే 3,4,5,6,7 సీక్వెల్స్ కూడా ఉంటాయని ఈ సినిమా నిర్మాత ప్రముఖ స్టార్ హీరో నాచురల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాని వెల్లడించారు. అంతేకాదు సెవెన్ సీక్వెల్లో మిగతా 6 సీక్వెల్స్ హీరోలు కూడా కనిపిస్తారని తెలిపి ఇప్పటినుంచే సినిమాపై అంచనాలు పెంచేశారు మరి ఏ రేంజ్ లో ఈ సీక్వెల్ సినిమాలు విజయవంతం అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: