తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగినటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను సంపాదించుకొని , ఆ తర్వాత ఎంతో మంది టాలీవుడ్ టాప్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ ఆఖరిగా తెలుగు లో కొండపొలం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ విజయాన్ని అందుకో లేక పోయినప్పటికీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం ఎక్కువ శాతం బాలీవుడ్ మూవీ ల లోనే నటిస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే రకుల్ ప్రీత్ సింగ్ హిందీ లో డాక్టర్ జి అనే మూవీ లో కీలక పాత్రలో నటించింది. అనుభూతి కశ్యప్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ డిజిటల్ విడుదల తేదీ వచ్చేసింది. డిసెంబర్ 13 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: