మహేష్ బాబు సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈయన ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సి ఉంది. అయితే మహేష్ బాబు కొన్ని అనారోగ్య కారణాలవల్ల అమెరికా వెళ్ళిపోవడం.. ఆ తర్వాత ఇండియాకి వచ్చిన వెంటనే తన అన్నయ్య రమేష్ బాబు మరణించడం.. ఆ బాధ నుంచి తేరుకోక ముందే సెప్టెంబర్ లో తల్లి ఇందిరాదేవి మరణించడం ఈ రెండింటి నుంచి బయటపడక ముందే మళ్లీ సూపర్ స్టార్ కృష్ణ మరణించడం అన్నీ ఒక్కసారిగా ఆయనను తీవ్ర సోకసంద్రంలోకి ముంచేసాయి.

అలా ఒకే కుటుంబంలో మూడు మరణాలు సంభవించడం నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పాలి . మహేష్ బాబు దుఃఖం చూసి అభిమానులు సైతం మరింత చింతిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ఆ బాధ నుంచి తీరుకోవాలని అందరూ ప్రార్థిస్తుండగా మహేష్ బాబు తన నాన్న తన మధ్య లేకపోయినా.. తనకు ఇచ్చిన ధైర్యం,  ప్రేమ ఎప్పుడూ తనతోనే ఉంటాయని.. ప్రేక్షకుల అభిమానం,  ఆశీర్వాదం తన వెంటే ఉండాలని కూడా కృష్ణ పెద్దకర్మ దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులను కోరిన విషయం తెలిసిందే.  ఇటీవలే తన భార్య నమ్రతాతో కలిసి ఏషియన్ సంస్థతో కలిసి ఏఎన్ పేరిట రెస్టారెంట్ ను కూడా ప్రారంభించారు.


ఇక అంత క్లియర్ అయిందని త్వరలోనే మహేష్ బాబు- త్రివిక్రమ్  కాంబోలో #SSMB 28 సినిమా షూటింగ్లో డిసెంబర్ 9వ తేదీ నుంచి పాల్గొనబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.  కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మళ్లీ మళ్లీ వాయిదా పడుతుండడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.  కనీసం ఇప్పటికైనా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: