తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దళపతి విజయ్ ఈ సంవత్సరం బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయ్ "వరసు" అనే తమిళ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తూ ఉండగా , రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే మూవీ యూనిట్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి రంజితమే అనే సాంగ్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇప్పటికి కూడా ఈ సాంగ్ యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ వ్యూస్ ను తెచ్చుకుంటుంది. తాజాగా వరిసు మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ది తలపతి అనే సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సాంగ్ విడుదల అయిన 24 గంటల సమయంలో 11.04 మిలియన్ వ్యూస్ ను , 9:30.7 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్సి లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: