చిన్న మీడియం రేంజ్ సినిమాలకు తమ సినిమాల కంటెంట్ బాగుండకపోయినా ఓటీటీ సంస్థలు భారీ మొత్తాలకు తమ సినిమాలను కొంటాయి అన్న ధైర్యంతో ఉండేవారు. దీనికితోడు కరోనా వేవ్ ల సమయంలో ప్రేక్షకులు ధియేటర్లకు రావడం మానేయడంతో ఓటీటీ ల హవా పెరిగిపోయి వరసపెట్టి తమకు అందుబాటులోకి వచ్చిన అన్ని సినిమాలను మోజుపడి కొనడంతో అనేక ఓటీటీ సంస్థలకు ఈ సంవత్సరం నష్టాలు రావడంతో వచ్చే సంవత్సరం నుండి ప్రముఖ ఓటీటీ సంస్థలు సినిమాలు కొనుగోలు విషయంలో మార్చిన రూల్స్ ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాల నిర్మాతలకు సమస్యగా మారినట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం కంటెంట్ బాగున్న చిన్న మీడియం రేంజ్ సినిమాలను కొనడానికి ఓటీటీ సంస్థలు ముందుకు వస్తున్నాయని అంటున్నారు. అంతేకాదు ఒప్పుకున్న మొత్తంలో సగభాగం మాత్రమే ముందు ఇచ్చి ఆతరువాత తాము స్ట్రీమ్ చేసిన సినిమాలకు వస్తున్న వ్యూస్ ను బట్టి పే పర్ వ్యూ విధానంలో గంటకు కొంత మొత్తాన్ని ఇచ్చే పద్ధతిలో మాత్రమే తాము చిన్నసినిమాలను కొంటామని ప్రముఖ ఓటీటీ సంస్థలు స్పష్టం చేస్తున్నట్లు టాక్.


ఈమధ్య కాలంలో అనేక ఓటీటీ సంస్థలు తాముకొన్న భారీ సినిమాలకు కూడ వ్యూస్ సరిగ్గా రాకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీ లను నమ్ముకుని అనేక చిన్న మీడియం రేంజ్ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడు ఈరూల్స్ అమలు జరిగితే భవిష్యత్ లో చిన్న మీడియం రేంజ్ సినిమాలు తీయడం చాలకష్టం అవుతుంది.ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడ రిలీజ్ అయిన తరువాత వచ్చే మొదటి సోమవారం కలక్షన్స్ భారీగా డ్రాప్ అవుతున్న పరిస్థితులలో ఈకొత్త ఓటీటీ నిబంధనలతో అటు ధియేటర్ల కలక్షన్స్ లేక ఇటు ఓటీటీ ఆదాయం లేక సినిమాలు తీయడం పెద్ద సమస్యగా మారే ఆస్కారం ఉంది అంటూ విశ్లేషణలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: