టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస విజయాలతో మూవీ మూవీ కి తన క్రేజ్ ను మరింత గా పెంచుకుంటున్న హీరో లలో ఒకరు అయినటు వంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్షణం మూవీ తో సోలో హీరో గా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం అందుకున్న అడవి శేషు ఆ తర్వాత అమి తుమీ , గూఢచారి , ఎవరు , మేజర్ , తాజాగా హిట్ ది సెకండ్ కేస్ మూవీ లతో వరస విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే అడవి శేషు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన మూవీ లలో గూఢచారి మూవీ ఒకటి. గూడచారి మూవీ ద్వారా అడవి శేషు కు అద్భుతమైన గుర్తింపు మరియు అద్భుతమైన విజయం లభించాయి. ఈ మూవీ కి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అడవి శేషు "గూడచారి 2" మూవీ పై ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన కథను శశి కిరణ్ తిక్క తో కలిసి అడవి శేష్ తయారు చేస్తున్నట్లు  ప్రస్తుతం ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అడవి శేష్ తో మూవీ లు చేయడానికి ప్రస్తుతం ఎంతో మంది నిర్మాత లు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. కాక పోతే అడవి శేషు మాత్రం సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటూ , చాలా స్లో గా ... చాలా స్టడీ గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. అడవి శేషు "గూడచారి 2" మూవీ తో పాటు మరో రొమాంటిక్ త్రిల్లర్ మూవీ లో కూడా నటించడానికి ప్రస్తుతం ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: