విలక్షణ హాస్య నటుడుగా పేరు గాంచిన ఎల్బీ శ్రీరామ్ రచయితగా ఇండస్ట్రీలోకి ఆతరువాత నటుడుగా మారాడు. సుమారు 500 సినిమాలలో నటించిన ఈ నటుడి డైలాగ్ డెలివరీలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఇండస్ట్రీలోని టాప్ హీరోల సినిమాలు అన్నింటిలోను నటించిన ఇతడి నట విశ్వరూపం ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘అమ్మో ఒకటవ తారీఖు’ సినిమాలో అతడి నటనకు ప్రశంసలతో పాటు అవార్డులు కూడా వచ్చాయి.


అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తన సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తానే దర్శకత్వం వహించి నటిస్తూ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాడు. అనేకమంది నూతన నటీనటులను కూడ పరిచయం చేస్తున్నాడు. నాటకరంగం నేపధ్యం నుండి వచ్చిన ఈయనకు నటన చాల సులువైన పని.


ఈమధ్య అమలాపురంలో ఘంటసాల శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఘంటసాల కాంస్య విగ్రహ ఆవిష్కరణ సభకు అతిధిగా వచ్చిన ఈయన తాను ఎందుకు సినిమాలకు దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయో తెలియచేసాడు. తనకు నచ్చని పనికి దూరంగా ఉంటానని ప్రస్తుతం హాస్యం పేరుతో వస్తున్న డైలాగ్స్ ను తన నోటితో చెప్పలేక తాను నటనకు దూరంగా ఉన్నాను అంటూ కామెంట్ చేసాడు.


ఒకప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో 40 మంది హాస్య నటులు ఉన్న స్వర్ణయుగాన్ని తాను చూసాను అంటూ తనకు హాస్యనటుడు అని అనిపించుకునే కంటే మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు అని అనిపించుకోవడం ఇష్టం అని చెపుతూ తాను జీవించి ఉన్నంతకాలం వీలైనన్ని మంచి షార్ట్ ఫిలిమ్స్ తీస్తాను అంటూ నేటి వర్తమాన హాస్య ధోరణి పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. విశ్వనాధ సత్యనారాయణ పాత్రలో ఆయన నటించిన చిత్రం ఆహా లో స్ట్రీమ్ అవుతూ అనేకమంది ప్రశంసలతో పాటు విమర్శకుల మెప్పును కూడ పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మారిన పరిస్థితులలో ఈయన చెపుతున్న మంచి హాస్యాన్ని ఆదరించే ప్రేక్షకులు ఉన్నారా అన్నది సందేహం..




మరింత సమాచారం తెలుసుకోండి: