తెలుగు సినీ ప్రేక్షకులకు ధన్య బాలక్రిష్ణ  తెలిసే ఉంటుంది. ఈమె తమిళం ,కన్నడ, మలయాళ సినిమాలలో నటిస్తూ తెలుగులో సాఫ్ట్వేర్ సుధీర్, నేను శైలజ, రాజుగారు గది వంటి సినిమాలలో నటించింది. వెండితెరపైనే కాకుండా ఈమె డిజిటల్ ప్లాట్ ఫామ్ లోను పలు వెబ్ సిరీస్ లో నటించడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా ఈమె పెళ్లై విడాకులు తీసుకున్న దర్శకుడిని పెళ్లి చేసుకుంది అంటూ అనేక  వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది నటి కల్పిక గణేశ్. ఇక ఈ విషయాన్ని తను ఒక యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో ద్వారా చెప్పడం జరిగింది.

దాని అనంతరం వీరిద్దరి మధ్య ఒక యుద్ధమే జరిగింది అని చెప్పాలి. సోషల్ మీడియా వేదికదా ఇద్దరూ వాదనలు కూడా చేసుకున్నారు. అయితే తాజాగా తమ పెళ్లి నిజమే అని డైరెక్టర్ బాలాజీ మోహన్ చెప్పుకొచ్చాడు. వారిద్దరికీ నిజంగానే పెళ్లయినట్లు కోర్టులో తెలిపారు ఈయన. అయితే ఈ నటి  వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్తలను బయటపడుతుంది అని మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశాడు డైరెక్టర్ బాలాజీ. ఇందులో భాగంగా వారిద్దరికీ పెళ్లయి దాదాపు సంవత్సరం కావస్తుందని మొదటి భార్యకు విడాకుల ఇచ్చిన అనంతరం ధన్యు ను

 రెండవ పెళ్లి చేసుకున్నానని ఆయన పిటిషన్ లో భాగంగా పేర్కొన్నారు. అంతేకాదు కల్పిక ఎప్పుడూ తమ వ్యక్తిగత విషయాలకు సంబంధించి మాట్లాడుతుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగానే నటి కల్పిక వీరిద్దరి వ్యక్తిగత విషయాలను ఎందుకు మాట్లాడుతుంది అన్నది మాత్రం ఇంకా తెలియదు. ఇక ఈ వార్త తెలిసిన అనంతరం చాలామంది నటి కల్పిక ధన్య బాలక్రిష్ణ పెళ్లి గురించి చెప్పిందంతా నిజమే అని భావిస్తున్నారు. దీంతో ధన్య బాలకృష్ణ పెళ్లి చేసుకోవడం నిజమే అన్న వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: