సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఒకవైపు జూనియర్ హీరోలు సరసం నటిస్తూనే మరోవైపు సీనియర్ హీరోలతో కూడా జోడి కట్టి రొమాన్స్ చేస్తూ ఉంటారు. ఇలా ఒకానొక సమయంలో ఏకంగా హీరోలుగా ఉన్న కొడుకులతో నటించిన వారు ఇక తర్వాత ఆ హీరోల తండ్రులతో కూడా కలిసి నటించడం లాంటిది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అక్కినేని ఫ్యామిలీలో అటు నాగ చైతన్యతో కలిసి నటించిన కొంతమంది హీరోయిన్లు ఆ తర్వాత కాలంలో ఏకంగా తండ్రి నాగార్జునతో కలిసి కూడా నటించడం చూసాం.


 నాగచైతన్యతో కలిసి ఒక సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఏకంగా తండ్రి నాగార్జునతో మన్మధుడు 2 సినిమాలో నటించి డిప్ రొమాన్స్ చేసింది అన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఇలా చేయడంతో అటు రకుల్ ప్రీత్ సింగ్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి.. ఇక ఇప్పుడు మరో క్యూట్ హీరోయిన్ కూడా ఇలా నాగార్జునతో నటించబోతుంది అన్నది తెలుస్తుంది. నాగచైతన్య మొదటి మూవీ అయిన ఒక లైలా కోసం సినిమాలో నటించింది పూజ హెగ్డే. ఇక తర్వాత కాలంలో ఎంతలా స్టార్ హీరోయిన్గా ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 అయితే ఇలా కొడుకు నాకు చైతన్యతో రొమాన్స్ చేసిన పూజా హెగ్డే ఇక ఎప్పుడు అటు తండ్రి నాగార్జునతో కూడా కలిసిన నటించబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే ఇది సినిమాలో కాదు. ఏకంగా ఒక వాణిజ్య  ప్రకటనలో. ఇటీవల ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది అన్నది తెలుస్తుంది. ఫ్రూట్ జ్యూస్ డ్రింక్ బ్రాండ్ గురించి ఈ  ప్రకటన ఉండబోతుందట. ఇక ఈ యాడ్లో అటు నాగార్జున, పూజ హెగ్డే కూడా సాధారణ శైలికి భిన్నంగా కనిపించినట్లు తెలుస్తోంది. ఇలా నాగార్జున, పూజ హెగ్డే కలిసి నటించబోతున్నారు అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: