ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతూ ఉన్నాడు. దిల్ రాజు నిర్మాణ సంస్థలో ఏదైనా సినిమా వస్తుందంటే చాలు అందులో కథ బలంగా ఉంటుందని ప్రేక్షకులు నమ్మే విధంగా తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు అని చెప్పాలి.  ఇకపోతే దిల్ రాజు 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. కొన్నాళ్లపాటు ఇదే విషయం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.


 అయితే ఇప్పుడు వరకు తమ పెళ్లి గురించి కానీ ఇక తన రెండో భార్యతో పరిచయం ఎలా ఏర్పడింది అన్న విషయంపై మాత్రం ఎక్కడ నోరు విప్పలేదు దిల్ రాజు. అయితే ఇటీవలే ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇక ఆయన రెండో భార్య తేజస్విని ఇంటర్వ్యూలో పాల్గొనగా ఇక తమ పెళ్లి గురించి.. అంతకుముందు తమ మధ్య జరిగిన పరిచయం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత దిల్ రాజు లవ్ స్టోరీ ఏకంగా సినిమా స్టోరీ ని తలపిస్తుంది అని ఆయన అభిమానులు అనుకుంటున్నారట.


 తన మొదటి మరణించిన తర్వాత ఎన్నో కష్టాలను అనుభవించాను. అప్పటికే నా వయసు 47 ఏళ్లు జీవితంలో ముందుకు వెళ్లాలి అనుకుంటున్నా సమయంలో రెండు మూడు ఆప్షన్స్ తనకు రెండో పెళ్లి కోసం వచ్చాయి. కానీ బిజీ లైఫ్ కారణంగా నన్ను అర్థం చేసుకునె వ్యక్తి నా జీవితంలోకి వస్తేనే బాగుంటుందని అనుకున్నాను. అలాంటి సమయంలోనే ఇక తేజస్విని నాకు పరిచయమైంది. ఫోన్ నెంబర్ తీసుకుని దాదాపు ఏడాది పాటు ఆమెతో మాట్లాడి ఇక ఒకరి గురించి ఒకరిని తెలుసుకున్న తర్వాతే నేను ప్రపోజ్ చేయడం... ఫ్యామిలీతో చర్చలు జరిపి వివాహం చేసుకోవడం జరిగింది అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇక తాను ఎయిర్ లైన్స్ లో పనిచేస్తున్నప్పుడు తరచూ అదే విమానంలో దిల్ రాజు ఎక్కువగా కనిపించేవారు. అలా ఏర్పడిన పరిచయం చివరికి ప్రేమకు దారితీసి తర్వాత పెళ్లి వరకు వచ్చింది అంటూ తేజస్విని కూడా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: