అషురెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలు మరియు ఫోటోషూట్లు చేస్తూ ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇలా ఈమెకు వచ్చిన పాపులారిటీతో ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో ఫేమస్ అయిన అషురెడ్డి అనంతరం కామెడీ స్టార్స్ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్నారు అలాగే పలు సినిమా అవకాశాలను కూడా ఆమె అందుకున్నారు. ఇక స్టార్ మా బిబి జోడి అంటూ సరికొత్త డాన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ లో పాల్గొన్నటువంటి కొందరు కంటెస్టెంట్లను జోడిగా చేసే ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అషురెడ్డి మెహబూబాకు జోడీగా ఆమె ఉన్నారు. అయితే ఫస్ట్ ఎపిసోడ్ లో తనతో కలిసి పెర్ఫార్మన్స్ చేసిన ఈమె రెండో ఎపిసోడ్ కు తనకు హ్యాండ్ ఇచ్చారని తెలుస్తుంది . ఇలా అషురెడ్డి హ్యాండ్ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితిలో మెహబూబా సింగిల్ గా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయాల్సి వచ్చిందని సమాచారం.. అయితే ఈమెకు ఆరోగ్యం బాగాలేదని అందువల్లనే తాను రాలేకపోయానని కూడా ఆమె తెలియజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అషురెడ్డి విదేశాలలో చక్కర్లు కొడుతున్నారు. అలాగే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలకు ఆమె హాజరయ్యారు. అలాగే కామెడీ స్టార్స్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.ఇలా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నటువంటి ఈమె బిగ్ బాస్ జోడి కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేకపోయారని తెలుస్తుంది.. అయితే కొందరు ఇదే విషయం గురించి భారీగా ట్రోల్ చేస్తున్నారట.. తన గురించి వస్తున్న ట్రోలింగ్స్ పై స్పందించిన ఈమె తనకు అనారోగ్య సమస్యల కారణంగానే ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారని దాదాపు నెల రోజులపాటు కోలుకోవడం కష్టమని చెప్పడంతోనే బీబీ జోడి నుంచి తప్పుకున్నానని ఆమె తెలిపారు. అలాగే ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి ప్రతి ఒక్కటి అందరితో షేర్ చేసుకోవాలని ఏమీ లేదు కాబట్టి తన విషయంలో ఎవరు కామెడీలు చేయొద్దు అంటూ కూడా నెటిజన్లకు అషురెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: