తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు విడుదల అయిన సినిమాలలో 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీలు ఏవో తెలుసుకుందాం.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీకి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ... రామ్ చరణ్ లు హీరోలుగా నటించారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి  భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన 6 వ రోజు 9.54 కోట్ల షేర్ కలక్షన్ వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు మూవీ విడుదల అయిన 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.52 కోట్ల షేర్ కలక్షన్లను చేసింది.

అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమా విడుదల అయిన 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.44 కోట్ల షేర్ కలక్షన్లను చేసింది.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా విడుదల అయిన 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.22 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.

మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని మైత్రి సంస్థ నిర్మించగా , శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ విడుదల అయిన 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.33 కోట్ల షేర్ కలక్షన్లను చేసింది. ఇప్పటికి కూడా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: