ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు ఈయన నాలుగేళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించనుండడంతో సినిమా పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా నిలిచినప్పటికీ.. ఇప్పుడు మరొక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇకపోతే దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 25వ తేదీన విడుదల కానుంది. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రిలీజ్ కి ముందే కాంట్రవర్సీ లతో కావలసిన అంత బజ్ తెచ్చుకుంది.

అంతేకాదు బేషరం రంగ్ పాటలో దీపికా ప్రదర్శించిన బికినీ హాట్ నెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు.  అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా బృందం ప్రమోషన్స్ వేగం పెంచగా రీసెంట్ ఇంటర్వ్యూలో దీపిక అందాల ప్రదర్శనను షారుక్ మెచ్చుకొని.. ఆమె డెడికేషన్ కి ఫిదా అవుతున్నాను అని చెప్పాడు . ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రీ సేల్స్ లో ఒక అరుదైన రికార్డు సృష్టించింది. ఈ సినిమా ప్రీ సేల్స్ ద్వారా ఇండియాలో ఇప్పటికే రూ.కోటి మార్కు సాధించింది.  కేవలం ఐదు గంటల్లోనే పార్షియల్ బుకింగ్స్ తో రికార్డు సృష్టించింది పఠాన్ సినిమా.

నిజానికి పూర్తిస్థాయి బుకింగ్స్ శుక్రవారం నుంచి అంటే ఈరోజు నుంచి ప్రారంభం కానుండగా ఇప్పటికే భారీ స్థాయిలో బుకింగ్స్ జరుగుతూ ఉండడం గమనార్హం. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టించబోతుంది. తాజాగా జరిగిన ప్రీ బుకింగ్స్ లో మ్యూట్ ఫ్లెక్స్ లలో హైదరాబాదులో ఘనంగా బుకింగ్స్ జరుగుతూ ఉండడం గమనార్హం.  ఒకరకంగా చెప్పాలి అంటే షారుక్ ఖాన్ మళ్లీ పునరాగమనం అయ్యాడు అని తెలుస్తోంది. దాదాపు నాలుగు సంవత్సరాలుగా 1000 కళ్ళతో ఆయన సినిమా కోసం ఎదురుచూసిన ప్రేక్షకుల కల జనవరి 25వ తేదీన తీరబోతోంది.  మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: