టాలీవుడ్ హీరోలు ఏ మూవీ లతో 2 మిలియన్ డాలర్లను యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నారో తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటివరకు 4 సినిమాలతో యూఎస్ఏ లో 2 మిలియన్ డాలర్లను అందుకున్నారు. ప్రభాస్ మొదటగా బాహుబలి మూవీతో 2 మిలియన్ డాలర్లను అందుకోగా , ఆ తర్వాత బాహుబలి 2 , సాహో , రాధే శ్యామ్ మూవీ లతో 2 మిలియన్ కలెక్షన్లను అందుకున్నాడు.

మహేష్ బాబు కూడా ఇప్పటివరకు 4 మూవీలతో యుఎస్ఏ లో 2 మిలియన్ డాలర్ కలెక్షన్లను అందుకున్నాడు. మహేష్ బాబు ఇప్పటివరకు భరత్ అనే నేను , శ్రీమంతుడు , సర్కారు వారి పాట , సరిలేరు నీకెవ్వరు మూవీలతో ఈ రేర్ మార్క్ ను టచ్ చేశాడు.

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు నాన్నకు ప్రేమతో , అరవింద సమేత వీర రాఘవ , ఆర్ఆర్ఆర్ మూవీలతో యుఎస్ఏ లో 2 మిలియన్ డాలర్ మార్క్ ను అందుకున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో మూడుసార్లు యూఎస్ఏ లో 2 మిలియన్ డాలర్లు అందుకున్నాడు. ఖైదీ నెంబర్ 150 ,  సైరా నరసింహారెడ్డి ,  వాల్తేరు వీరయ్య మూవీ లతో చిరంజీవి ఈ కలెక్షన్లను సాధించాడు.

రామ్ చరణ్ తన కెరీర్ లో రంగస్థలం , ఆర్ఆర్ఆర్ మూవీలతో ఈ రేర్ మార్క్ ను టచ్ చేసాడు.

అల్లు అర్జున్ ఇప్పటివరకు తన కెరీర్లో అలా వైకుంఠపురంలో , పుష్ప మూవీ లతో ఈ రేర్ మార్క్ ను టచ్ చేసాడు.

పవన్ కళ్యాణ్ తన కెరియర్లో అజ్ఞాతవాసి , భీమ్లా నాయక్ మూవీ లతో ఈ రేర్ మార్క్ ను టచ్ చేశాడు.

వరుణ్ తేజ్ తన కెరియర్లో ఫిదా , ఎఫ్ 2 మూవీలతో ఈ రేర్ మార్క్ ను టచ్ చేసాడు.

విజయ్ దేవరకొండ తన కెరియర్లో గీత గోవిందం మూవీ తో ఈ రేర్ మార్క్ ను టచ్ చేశాడు.

నితిన్ "అ ఆ" మూవీతో ఈ రేర్ మార్క్ ను టచ్ చేశాడు.

వెంకటేష్ "ఎఫ్ 2" మూవీ తో ఈ రేర్ మార్క్ ను టచ్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: