టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహం నందమూరి బాల కృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా గతేడాది విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా విడుదలైన దాదాపు సంవత్సరం తరువాత బాలకృష్ణ అఖండ మూవీ బాలీవుడ్ లో విడుదల అయింది. నిన్న జనవరి 20 వ తేదీన అఖండ హిందీ వెర్షన్ థియేటర్స్ లో విడుదల అవ్వగా ఆ మూవీ రిజల్ట్ దెబ్బకు బాలయ్య షాక్ అయ్యాడు. హిందుత్వం చాటి చెప్పే సినిమాకు ఎక్కడలేని గుర్తింపు బాలీవుడ్ లో ఈ మధ్య కనిపిస్తుంది. కార్తికేయ ఇంకా కాంతార వంటి హిందుత్వ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ మ్యాజిక్ చేశాయి. అసలు పరిచయం కూడా లేని హీరోలు డివోషనల్ కంటెంట్ తో పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. కార్తికేయ2 తో నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యాడు.


డివోషనల్ కంటెంట్ కార్తీకేయ2ని బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ చేసింది. కార్తికేయ2కి వరల్డ్ వైడ్ గా మొత్తం 121 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తే కేవలం బాలీవుడ్ లోనే 40కోట్ల పైగా వచ్చాయి. ఇక కాంతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 400కోట్లు కొల్లగొడితే.. బాలీవుడ్ లో 90 కోట్లు పైగా వసూల్ చేసింది.అయితే బాలకృష్ణ అఖండ కూడా ఇదే విధంగా రాణిస్తుంది అనుకుంటే షాకింగ్ కలక్షన్స్ వస్తుండటం నందమూరి అభిమానులని ఎంతగానో కలవర పెడుతుంది. బాలీవుడ్ లో 7 కోట్లు టార్గెట్ తో బరిలోకి దిగిన అఖండకి హిందీలో తొలిరోజు కేవలం 50లక్షలు మాత్రమే రాబట్టింది. తెలుగులో బాలయ్యని ఒక రేంజిలో నిలబెట్టిన అఖండ సినిమా బాలీవుడ్ లో పెద్ద దెబ్బ ఏసేసింది. సింహా ఇంకా లెజెండ్ తర్వాత అంతకు మించిన స్థాయిలో అతి పెద్ద హిట్ కొట్టిన అఖండ హిందీ వెర్షన్ లో మాత్రం ఫెయిల్ అవ్వడం షాక్ ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: