ఈ మధ్య కాలం లో పాన్ ఇండియా అనే పదాన్ని ఎక్కువగా నే వాడుతున్నారు. తమ సినిమా లను ఉత్తర భారతం తో పాటు సౌత్ లోని అన్ని భాషల్లో కూడా విడుదల చేయాలని ఉబలాటపడుతున్న దర్శకులు ఎంతో మంది అయితే ఉన్నారు.

చిన్న హీరోలతో సినిమా లను తెరకెక్కించి కూడా హిందీ, తమిళ్ మరియు కన్నడ, మలయాళం లో విడుదల చేయాలని ఎంతో మంది ఉన్నారు. కానీ కొద్ది మంది దర్శకులు మాత్రం తమ సినిమాలు తెలుగు లో ఆడితే చాలు, తెలుగు ప్రేక్షకుల వరకు తమ సినిమా ను ఎంజాయ్ చేసే చాలు అన్నట్లుగా అయితే ఉన్నారు. వారిలో మొదట ఉండే దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అనడంలో సందేహం అయితే లేదు. ఈయన గత కొంత కాలం గా వరుసగా హిట్స్ ని అందిస్తూనే ఉన్నారని అందరికి తెలుసు.. అయినా కూడా ఎప్పుడూ పాన్ ఇండియా సినిమా జోలికి మాత్రం వెళ్లలేదు. 

గతం లో ఈయన దర్శకత్వం లో వచ్చిన సినిమాలు ఉత్తర భారతం లో డబ్బింగ్ అయ్యి మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకున్నాయి. మరి కొన్ని రీమిక్ కూడా అయ్యాయి, కానీ ఈయన మాత్రం పాన్ ఇండియా సినిమా అనే పదానికి ప్రాముఖ్యత ను అస్సలు ఇవ్వడం లేదు. కంటెంట్ బాగుంటే అన్ని భాషల్లో ను అదే ఆడుతుంది. కనుక మనం ప్రత్యేకంగా ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్పనక్కర్లేదు అనేది త్రివిక్రమ్ యొక్క మాట. అందుకే ఆయన తన సినిమా ను పాన్ ఇండియా సినిమా అంటూ ప్రమోట్ అయితే చేయడు. సినిమా విడుదలైన తర్వాత కంటెంట్ బాగుంటే అక్కడ రీమేక్ అవడం లేదంటే డబ్బింగ్ అవడం జరుగుతుందని ఆయన ఎప్పుడు భావిస్తూ ఉంటాడట. కంటెంట్ విషయం లో రాజీ పడకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నే సినిమాలు తీయడమే తన యొక్క లక్ష్యం అన్నట్లుగా త్రివిక్రమ్ ఒక సందర్భంలో అయితే పేర్కొన్నారు. ప్రస్తుతం ఈయన మహేష్ బాబు హీరో గా ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: