నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం వీర సింహారెడ్డి జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది . అందులో హీరోయిన్గా శృతిహాసన్ తో పాటు మలయాళ బ్యూటీ హనీ రోజ్ కూడా నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మొన్నటి వరకు ఈమె గురించి పెద్దగా తెలియని తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాతో ఈమెకు భారీగా అభిమానులుగా మారిపోతున్నారు.. ఇకపోతే ఈ సినిమాకు పోటీగా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమాతో పోల్చితే బాలకృష్ణ సినిమా వెనుకబడి ఉన్నా సరే బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక కలెక్షన్ల సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన శృతిహాసన్ , హనీ రోజ్ లకు మంచి గుర్తింపు లభించింది.  ఒక రకంగా చెప్పాలి అంటే శృతిహాసన్ కంటే హనీ రోజ్ కి భారీగా పాపులారిటీ లభించిందని చెప్పవచ్చు.  ఈ సినిమాలో మీనాక్షి క్యారెక్టర్ లో చాలా ఒదిగిపోయి నటించింది హనీ రోజ్. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హనీ రోజ్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.  బాలకృష్ణ,  హనీ రోజ్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందని భావించిన నందమూరి బాలకృష్ణ ఆమెను తన తదుపరి సినిమాకి కూడా రికమెండ్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108 వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా హనీ రోజ్ ను తీసుకోమని బాలయ్య స్వయంగా రికమండ్ చేశారని వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే వీరసింహుని విజయోత్సవం సక్సెస్ మీట్ లో కూడా హనీ రోజ్ సందడి చేసింది. అంతేకాదు బాలయ్యతో కలిసి డ్రింక్ చేస్తున్న ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.  దీంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిందని అందుకే ఇప్పుడు ఆయన మళ్ళీ తన సినిమాలో రికమెండ్ చేశారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: