మన తెలుగు ఇండస్ట్రీ లో ఇపుడు ఉన్నా కుర్రకారుకి జయమాలిని, జ్యోతి చిత్ర, జ్యోతి లక్ష్మి అనే పేర్లు పెద్దగా తెల్సి ఉండక పోవచ్చు. ఒక నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్తే అపుడు వారి గురించి తెలుస్తుంది. అప్పట్లో ఐటమ్ సాంగ్స్ చేసేవాళ్ళు సినిమాల్లో. ఐతే ఇక్కడ విశేషం ఏంటంటే వారిద్దరూ సొంత అక్కాచెల్లెళ్లు అన్నా సంగతి చాలా మందికి తెలీదు.

వారిద్దరిలో  జ్యోతిలక్ష్మి అక్కయితే జయమాలిని చెల్లెలు.ఐతే 1970 లలో వచ్చిన సినిమాల్లో జ్యోతిలక్ష్మి చాలా బిజీగా ఉండేది.ఆమె తెలుగు, తమిళ, మలయాళ కన్నడ, హిందీ పరిశ్రమలో వందల సంఖ్యలో మూవీస్ ల్లో క్లబ్ డాన్సర్ గా ఐటం సాంగ్స్ లో నెంబర్ వన్ గా కనిపించేది.

ఐతే ఆమె 2016లో చనిపోయింది. ఐతే ఆమె చివరి దశలో ఎక్కువగా కుటుంబానికి దగ్గరగా ఉండేది. వారి కుటుంబంలో జయలక్ష్మి పెద్దమ్మాయి కాగా జయమాలిని మాత్రం అందరికంటే చిన్నమ్మాయి.ఐతే జయమాలిని ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రమే జ్యోతిలక్ష్మికి మూవీస్ లో ఛాన్సెస్ తగ్గుతూ వచ్చాయి.ఫస్టులో తమిళంలోనే వీరు చాలా సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్స్ గా కూడా చేసారు.ఐతే వారు చేసింది  తక్కువ సినిమాలతోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

కాకపోతే వారికున్న  హైట్, పర్సనాలిటీ ప్రకారం కొందరు డైరెక్టర్స్ వీరిని వ్యాంప్ క్యారెక్టర్స్ కి మాత్రమే పరిమితం చేసారు.దాంతో తర్వాత తర్వాత వారికీ ఆ పాత్రలే ఎక్కువ అవకాశాలు ఇండస్ట్రీ లో తెచ్చి పెట్టాయి. ఐతే వారింకా తర్వాత కాలంలో ఎక్కువగా అలాంటి పాత్రలే చేయాల్సి వచ్చింది.ఈవిధంగా జ్యోతిలక్ష్మి, జయమాలిని ఇద్దరు కూడా నేషనల్ లెవెల్ లో అనేక  భాషల్లో వందల మువీస్ ల్లో ఐటెం గర్ల్ గా నటించారు.

అలాగే కొన్నేళ్లపాటు అసలు అక్క ఉందనే విషయం కూడా జయమాలిని కి తెలిసేది కాదు ఎందుకంటెజ్యోతి లక్ష్మి ని వాళ్ల మేనత్త దగ్గర పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: