టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన కొడుకు రోషన్ అందరికీ తెలిసే ఉంటాడు.ఆయన నటించింది రెండు మూడు సినిమాల్లోని అయినప్పటికీ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు శ్రీకాంత్ కొడుకు రోషన్. మొదటిగా రోషన్ నిర్మల కాన్వెంటనే సినిమాతో ఎంట్రీ ఏడ్చాడు. దాని అనంతరం పెళ్లి సందడి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్. పెళ్లి సందడి సినిమా రోషన్ కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది.దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు పర్యవేక్షణలో తెరకెక్కిన 

సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ సినిమాలో రోషన్ హీరోగా నటించినప్పటికీ రోషన్ కి జోడిగా ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో శ్రీ లీల రేంజ్ ఎక్కడికి వెళ్ళిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి సందడి అనే టైటిల్ తో గతంలోని రోషన్ తండ్రి శ్రీకాంత్ సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. ఇక తండ్రి సినిమా టైటిల్ ని కొడుకు కూడా తన సినిమాకి పెట్టుకొని మళ్ళీ ఈ సినిమాను తీయడం జరిగింది. ఇక ఈ సినిమా అనంతరం రోషన్ హీరోగా మరో సినిమా కూడా త్వరలోనే రాబోతుంది.

స్వప్న సినిమాస్ బ్యానర్ పై వైజయంతి మూవీస్ పతాకంపై ఈ సినిమా తలకెక్కనుంది. ఇక రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పిరియాడిక్ డ్రామాగా  తెరకెక్కనుంది.ఇక ఇటీవల వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చిన సీతారామం సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ కొడుకు రోషన్ సినిమా కూడా అదే బ్యానర్ పై వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో రోషన్ కి ఇప్పుడిప్పుడే మార్కెట్ బాగా పెరుగుతుంది.ఈ సినిమా విడుదలయితే రోషన్ కచ్చితంగా ఒక పెద్ద స్టార్ హీరో అవుతాడు అని  ఆయన అభిమానులు భావిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: