సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది కి మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ లభిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో యంగ్ బ్యూటీ శ్రీ లీల ఒకరు. ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం సాధించినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ లభించింది. దానితో ప్రస్తుతం శ్రీ లీల వరస మూవీ లలో నటిస్తూ కెరియర్ ను అద్భుతమైన రీతిలో ముందుకు సాగిస్తోంది. పోయిన సంవత్సరం ఈ ముద్దు గుమ్మ రవితేజ హీరోగా రూపొందిన ధమాకా మూవీ లో హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ప్రస్తుతం కూడా శ్రీ లీల ... రామ్ హీరో గా రూపొందుతున్న మూవీ లోను ... మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న మూవీ లోను హీరోయిన్ గా నటిస్తోంది. 

అలాగే బాలకృష్ణ ... అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో బాలకృష్ణ కు కూతురుగా శ్రీ లీల నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే స్టిల్స్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్  అవుతుంది. ఇలా శ్రీ లీల సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులతో టచ్ లో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: