క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి పేరున్న కృష్ణ వంశీ గారు. ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో తన సినిమాల గురించి చెప్పుకొచ్చారు.ఆయన ఖడ్గం సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు చెప్పుకొచ్చాడు.…

ఆయన చేసిన మురారి సినిమా విడుదల అయి మంచి విజయం సాధించిన తర్వాత  ఏం సినిమా చేద్దాం ని ఆలోచిస్తున్నప్పుడు దేశ భక్తి మీద మంచి సినిమా ఒకటి చేయాలి అనుకొని ఖడ్గం సినిమా కథ రాసుకున్నారట.దాంట్లో భాగంగా ఈ సినిమా లో ఆర్టిస్ట్ ల కోసం కృష్ణ వంశీ ముందుగా చాలా మంది హీరో లని అయితే అనుకున్నాడని సమాచారం.

కానీ ఫైనల్ గా రవితేజ, శ్రీకాంత్ మరియు ప్రకాష్ రాజ్ లతో సినిమా చేసి భారీ హిట్ అందుకున్నారు.. ఈ సినిమా స్టోరీ మొత్తం  పూర్తి అయిన తరువాత కృష్ణవంశీ ఈ కథని రవితేజ కి చెప్తే కథ మొత్తం విన్న రవితేజ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పాడట తర్వాత కృష్ణవంశీ రవితేజ తో సినిమా పిచ్చోడు గా ఉండే చంటి క్యారెక్టర్ నువ్వు చేయాలి అని చెప్పగానే రవితేజ చంటి క్యారెక్టర్ ఎంతో బాగుంది కానీ నాకు ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలనీ ఉంది అని అడిగాడట.

అప్పుడు కృష్ణ వంశీ ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా నువ్వు బాగానే చేస్తావ్ కానీ నువ్వు చేయాల్సిన చంటి క్యారెక్టర్ నీలాగా ఎవ్వరు కూడా చేయలేరు అని చెప్పడంతో రవితేజ చంటి క్యారెక్టర్ చేసాడు పోలీస్ ఆఫిసర్ క్యారెక్టర్ శ్రీకాంత్ చేసాడనీ తెలుస్తుంది...అలాగే ఈ విషయాలన్నీ చెప్తూనే ఈ క్యారెక్టర్ గురించి జరిగిన ఇంకో సంఘటన కూడా చెప్పుకొచ్చారు. ఈ కథ తో ముందు ఒక ప్రొడ్యూసర్ ని కలిస్తే స్టోరీ విన్న ఆ ప్రొడ్యూసర్ కి కథ ఎంతగానో నచ్చింది అని చెప్పి ఈ కథ లో ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కోసం ఎవరిని అనుకుంటున్నావు అని అడిగారట అప్పుడు ఇలా శ్రీకాంత్ ని అనుకుంటున్నాను అని కృష్ణ వంశీ చెప్పగానే ఆయన వద్దు వేరే వాళ్ళని పెడుతా అంటే చెప్పండి నేనే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తా అని కూడా చెప్పాడట.అప్పుడు కృష్ణ వంశీ కి కోపం వచ్చి నువ్వు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు అని అక్కడి నుంచి బయటికి వచ్చేసాడట.. ఈ పోలీస్ క్యారెక్టర్ కోసం చాలా మంది పోటీ పడ్డారు కానీ చివరిగా శ్రీకాంత్ ఆ క్యారెక్టర్ చేసి దానికి బాగా న్యాయం చేసాడని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: