నందమూరి కుటుంబం గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఈ కుటుంబం నుంచి ఎంతోమంది పొలిటికల్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన వారు ఉన్నారు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న వారు కూడా ఉన్నారు. నందమూరి వంశానికి వారి శాపమే తగిలింది అంటూ ఇప్పుడు పలు వార్తలు చర్చ జరుగుతున్నాయి ఇదంతా రాజకీయం అంతే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి నందమూరి వంశానికి నారా శాపమే తగిలింది అంటూ వార్త వినిపిస్తున్నాయి. అటు రాజకీయంగా వెన్నుపోటుకి గురయ్యారని వార్త ఒకటి వైరల్ గా మారుతుంది.


కానీ నందమూరి కుటుంబంలో లక్ష్మీపార్వతి పెట్టిన చిచ్చు వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది అంటూ మరి కొంతమంది నాయకులు నందమూరి అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే స్వర్గీయ ఎన్టీఆర్ మానసికంగా కృంగిపోయారని ఆయన మరణానికి ఒక వెన్నుపోటే కారణం అన్నట్లుగా వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. వ్యక్తుల కంటే పార్టీ నే గొప్పదన్నమాట వినడానికి చాలానే బాగున్నప్పటికీ కానీ పార్టీని స్థాపించిన వ్యక్తినే రాజకీయంగా మట్టి పెట్టి ప్రయత్నం చేసి ఆయన స్థాపించిన పార్టీ ఇతరుల చేతికి వెళ్లడంతో నందమూరి అభిమానుల సైతం సహించలేకపోతున్నారు.

ఇక ఇదంతా గతంలో వార్త అయితే ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు .యువ మంగళం పేరుట కుప్పం నుంచి ఈ పాదయాత్రను మొదలు పెట్టాలనుకున్నారు. కానీ ఇందులో నందమూరి తారక రత్న ప్రస్తుతం ఆ పాదయాత్రకు పనులను కూడా దగ్గరుండి చూసుకున్నారు ఈ సమయంలోనే తారకరత్నకు గుండెపోటు ఎదురయ్యింది. ప్రస్తుతం ఈ నటుడు పరిస్థితి విషయంగానే ఉన్నట్లు తెలుస్తోంది నందమూరి కుటుంబానికి నారా పోటు అన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది నాయకులు ఈ విషయాన్ని అవునని అంటుంటే మరి కొంత మంది అదేం కాదా అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలను తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: