పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమా సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ ఎవరన్నది ఇంకా డిసైడ్ కాలేదు. ఇదిలాఉంటే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని తీసుకున్నారు. భీంలా నాయక్ సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది. అందుకే థమన్ ని రిపీట్ చేస్తున్నారు.

అయితే పవన్, సుజిత్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ని తీసుకోవాలని అనుకున్నారట. కానీ అతను దాదాపు అరడజనుకి పైగా సినిమాలు చేస్తుండటం వల్ల అనిరుద్ కుదరదని చెప్పాడట. సినిమాకు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అనిరుద్ ప్లేస్ లో థమన్ ని ఫిక్స్ చేశారట. థమన్ కూడా ఈమధ్య తన మ్యూజిక్ తో అదరగొడుతున్నాడు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. సాహో తర్వాత సుజిత్ చేస్తున్న ఈ పవర్ ప్యాక్డ్ మూవీకి థమన్ తన బెస్ట్ ఇస్తాడని చెప్పొచ్చు.

పవన్, సుజిత్ ఈ రేర్ కాంబో సినిమా అది కూడా గ్యాంగ్ స్టర్ సినిమా అనేసరికి పవర్ స్టార్ ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. వీరమల్లు పూర్తి కాగానే ఓ పక్క ఉస్తాద్ భగత్ సింగ్ కి.. సుజిత్ సినిమాకు రెండిటికీ పవన్ డేట్స్ ఇవ్వాలని చూస్తున్నాడు. పవన్ కచ్చితంగా ఈ సినిమాలతో మరోసారి తన స్టామినా చూపిస్తాడని చెప్పొచ్చు. సాహోతో పాన్ ఇండియా అటెంప్ట్ చేసిన సుజిత్ పవర్ స్టార్ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నట్టు టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: