సంక్రాంతి సినిమాల హడావిడి చల్లారిన తరువాత విడుదలైన సుధీర్ బాబు ‘హంట్’ మూవీకి ఏవరేజ్ టాక్ రావడంతో ఈమూవీ పై అతడు పెట్టుకున్న ఆశలు నీరుకారిపోయాయి. దీనితో వచ్చేనెల మొదటివారంలో విడుదలకాబోతున్న ‘రైటర్ పద్మభూషణ్’ ఊహించని హిట్ ను ఇస్తుందా అంటూ అంచనాలు ఇండస్ట్రీ వర్గాలలో వస్తున్నాయి.

 

 

యంగ్ హీరో సుహాస్ నటించిన ఈమూవీని గీతా ఆర్ట్ సంస్థ విడుదల చేస్తూ ఉండటంతో ఈమూవీలో ఏదోఒక విషయం ఉంది అన్నమాటలు వినిపిస్తున్నాయి. ‘కాంతార’ సూపర్ సక్సస్ తరువాత గీతా సంస్థ ఈమూవీని విడుదల చేస్తూ ఉండటంతో సక్సస్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అంచనాలు వస్తున్నాయి. దీనికితోడు ‘కలర్ ఫోటో’ మూవీతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ చాల డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉండటంతో ఈమూవీ గురించి అందరు చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

 సాధారణంగా ఒక చిన్న సినిమాను ప్రమోట్ చేసే విషయంలో ముందుగా ఆసినిమా రిలీజ్ కాకుండా కొన్ని ముఖ్యనగరాలలో ఆసినిమాను స్పెషల్ గా స్క్రీనింగ్ చేయడంచేయరు. ఆవిధంగా చేయాలి అంటే ఆసినిమా పై చాల నమ్మకం ఉండాలి. ఈమూవీ పై నిర్మాతలకు ఉన్న మితిమీరిన నమ్మకంతో ఈమూవీ విడుదల కాకుండానే హైదరాబాద్ విజయవాడ తిరుపతి విశాఖపట్నం లాంటి నగరాలలో సినిమా విడుదల కాకుండానే చాలముండుగా ప్రీమియర్ షోలు వేస్తున్నారు.

 

 గతంలో అడవిశేషు నటించిన ‘మేజర్’ మూవీ విడుదల కాకముందు దేశవ్యాప్తంగా ప్రీమియర్ షోలు వేసారు. ఆ ప్రీమియర్ షోల సమయం నుండి ‘మేజర్’ సినిమాకు చాల మంచి టాక్ రావడంతో ఆమూవీ సూపర్ హిట్ మూవీగా మారింది. ఇప్పుడు అదే ట్రెండ్ ను కొనసాగిస్తూ ‘రైటర్ పద్మనాభం’ నిర్మాతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఈమూవీ విడుదల కాకుండానే ఈమూవీకి హిట్ టాక్ తీసుకు రావాలని చాల తెలివిగా వ్యవహరిస్తున్నారు అనుకోవాలి. ఈమూవీ అంచనాలకు అనుగుణంగా ఈమూవీ హిట్ అయితే సుహాస్ కెరియర్ కు మరొక మెట్టు ఎక్కినట్లే అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: