టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా సినిమా దసరా. ఎన్నడూ లేని విధంగా తన కెరియర్ లోనే మొట్టమొదటిసారి ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు నాచురల్ స్టార్ నాని. ఇక ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ పరంగాను మరియు ఓటీటి రైట్స్ పరంగాను రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా మార్చ్ 30న తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

 అయితే ఈ నేపథ్యంలోనే సోమవారం విడుదల చేసిన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమా 90 దశకం నేపథ్యంలో సాగానందని సమాచారం. ఈ సినిమా టీజర్ ను చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.ఎన్నడూ లేని విధంగా ఈ టీజర్ లో నాని కనిపించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఈ విషయం తాజాగా విడుదలైన టీజర్ రిలీజ్ సందర్భంగా తాను మాట్లాడిన మాటలే.ఇదిలా ఉంటే ఇక పాండమిక్ తర్వాత సినిమాలో ఎంపిక విషయంలో వేగం తగ్గించాడు నాని. అనంతరం తాజాగా ఇప్పుడు సినిమాల ఎంపిక విషయంలో హై స్పీడ్ లో దూసుకుపోతున్నాడు నాచురల్ స్టార్.

సినిమా తరువాత వరుస సినిమాలో లైన్లో పెట్టాడు నాని. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రిలీజ్ అయిన అనంతరం నాని మరో కొత్త దర్శకుడు శౌర్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవం మంగళవారం లాంఛనంగా హైదరాబాద్లో చిరు చేతుల మీదుగా జరిగింది. ఈ సినిమాతో పాటు నాని మరో రెండు స్క్రిప్ట్లను కూడా లైన్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు హిట్ 3 సినిమాని కూడా ఈ ఏడాది చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే నాని ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. వీటితో పాటు పరశురాం దర్శకత్వంలో కూడా ఒక సినిమాని లైన్ లో పెట్టాడు నాని..!!

మరింత సమాచారం తెలుసుకోండి: