ఒకప్పుడు సినిమాల్లో వరసగా అవకాశాలు దక్కించుకొని.. ఆ తర్వాత మాత్రం అవకాశాలు లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీలో కనుమరుగైన నిన్నటి తరం హీరోల గురించిన వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి వార్తలను ఆయా హీరోల అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అయితే నిన్నటి తరం హీరో అయినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు మదిలో చెరుగని ముద్ర వేసుకున్న హీరోలలో ఆకాష్ కూడా ఒకరు అని చెప్పాలి.


 అప్పట్లో ఫ్యామిలీ హీరోగా ఆకాష్ కి మంచి గుర్తింపు ఉండేది. ఆకాష్ నిజానికి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకులను మాత్రం బాగా ఆకట్టుకున్నారు. ఆనందం అనే సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో రేస్ లోకి వచ్చేసాడు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో కూడా నటించి పాపులారిటీ సంపాదించుకున్నాడు. కానీ అవకాశాలు లేక కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న ఆకాష్ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే చూడాలని అభిమానులు ఆశపడ్డారు.


 కానీ ప్రస్తుతం ఆకాష్ చేస్తున్న పని తెలిసి అయ్యో పాపం అంటున్నారు అభిమానులు. ఎందుకంటే ఒకప్పటి స్టార్ హీరో ఆకాష్ ఇక మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు అనుకుంటే అందుకు భిన్నంగా ఏకంగా బుల్లితెర ధారావాహికల్లో నటించేందుకు సిద్ధమయ్యాడు. జెమినీ టీవీలో కొత్త సీరియల్ షూట్ ప్రారంభం మరికొన్ని రోజుల్లో కానుంది. ఈ సీరియల్లో కీలకపాత్రలో ఆకాష్ కనిపించబోతున్నాడట. అయితే గతంలో కొన్ని తమిళ సీరియల్స్ నటించిన ఆకాష్ ఇప్పుడు తెలుగు సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి ఏ స్థాయిలో సక్సెస్ అవుతాడో చూడాలి మరి. ఇలా వెండితెరపై హీరో అయ్యుండి బుల్లితెరపై సీరియల్స్ లోకి రావడంతో ఇక అయ్యో పాపం అంటున్నారు కొంతమంది ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: