
తన సినీ ప్రస్థానంలో ఏకంగా 450 కి పైగా చిత్రాలలో నటించిన ఈమె 80 వ దశకంలో దక్షిణాది చిత్రసీమను ఏకచత్రాధిపత్యంగా ఏలారు. ముఖ్యంగా చాలామంది దర్శక నిర్మాతలు ఈమె కోసం క్యూ కట్టేవారు. అతి తక్కువ సమయంలోనే 500కు చేరువలో చిత్రాలు తెరకెక్కించి.. మరింత పాపులారిటీ దక్కించుకొని ఎంతోమంది అబ్బాయిల కలల రాకుమారిగా మారిన ఈమె 36 సంవత్సరాలకే ఆత్మహత్య చేసుకుని మరణించింది. అయితే ఈమెది హత్య అని.. ఇప్పటికీ కూడా వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే సిల్క్ స్మితకు సంబంధించిన ఎప్పటికప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.
సిల్క్ స్మిత మరణ వార్త విని సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అయ్యింది. ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సిల్క్ స్మిత మరణించినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా చూడడానికి రాకపోవడం జర్నలిస్టులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. చివరిగా అర్జున్ సర్జ మాత్రమే సిల్క్ స్మిత చనిపోయినప్పుడు చూడడానికి రావడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఇదే మాటనే కొంతమంది జర్నలిస్టులి అర్జున్ ని అడగగా..అంతకు కొద్ది రోజుల ముందే సినిమా షూటింగ్ చివరి రోజుల్లో నేను చనిపోతే చూడడానికి వస్తావా? అని సిల్క్ స్మిత అడిగింది. ఛీ అదేమి మాట? అని నేను తేలిగ్గా కొట్టి పారేశాను. కానీ ఆమె నిజంగా మరణించడం తట్టుకోలేకపోతున్నాను అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశారు అర్జున్.