
ఆహా అనే తెలుగు ఓటీటిని స్థాపించి డిజిటల్ విభాగంలో కూడా తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇలా చిన్న సినిమా అయినప్పటికీ మాస్టర్ మైండ్ ఆలోచనలతో అల్లు అరవింద్ నిర్మించిన సినిమా గీతాగోవిందం. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అరవింద్ కి భారీగా లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు పరశురాం దర్శకుడిగా వ్యవహరించాడు. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది అన్న విషయం తెలిసిందే.
అయితే ఇక గీత గోవిందం దర్శకుడు పరశురాం ఇక ఇప్పుడు గీత ఆర్ట్స్ అధినేత స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి షాక్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. గీత గోవిందం సినిమా సీక్వెల్ కోసం మొదట పరుశురాం అల్లు అరవింద్ కి కమిట్మెంట్ ఇచ్చాడట. కానీ ఇక ఇటీవల దిల్ రాజు ప్రొడక్షన్లో సీక్వెల్ అనౌన్స్ చేశాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై అల్లు అరవింద్ సీరియస్ అయ్యాడట. కానీ గొడవ చేయడం ఎందుకు అని అల్లు అరవింద్ ఊరుకున్నాడట. ఇలా మొత్తంగా సర్కారు వారి పాట దర్శకుడు పరశురాం నిర్మాత అల్లు అరవింద్ ను మోసం చేశాడంటూ వార్తలు వస్తున్నాయి.