లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన కాజల్ అగర్వాల్ తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించింది అన్న విషయం తెలిసిందే. తన అందం  అభినయం తో టాలీవుడ్ చందమామగా గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలు అందరి సరస్సన కూడా నటించి పర్ఫెక్ట్ జోడి అనిపించింది అని చెప్పాలి.


 ఇక కెరియర్ లో వరుసగా అవకాశాలు వస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సమయం లో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకుని ఇక ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆనందం గా గడుపుతుంది. అయితే ఇటీవలే ఒక బిడ్డకు తల్లి కూడా అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల బాబు పుట్టిన తర్వాత కాజల్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని భావిస్తుంది. ఈ క్రమం లోనే కాజల్ కు అవకాశాలు కూడా మెండుగానే వస్తున్నాయి. ఇక బాలకృష్ణ సరసన ఒక సినిమా లో నటించబోతుందంటూ ఇప్పటికే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.


 అయితే ఈ సినిమాలో బాలకృష్ణ, కాజల్ ఇద్దరు భార్యాభర్తలుగా నటిస్తూ ఉంటే.. ఇక బాలయ్య కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల కనిపించ బోతుంది. అయితే ఇక్కడే కాజల్కు అసలు భయం మొదలైందట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో శ్రీ లీలా హీరోయిన్ గా వచ్చిన ధమాకా సినిమాలో రవితేజను మించి పర్ఫామెన్స్ చేసింది ఆ యంగ్ హీరోయిన్. ఇక ఈ అమ్మడు ఎక్స్ప్రెషన్స్ కి ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే కాజల్ ఇప్పుడు శ్రీలీలకు తల్లిగా నటించబోతుంది. దీంతో పర్ఫామెన్స్ విషయంలో శ్రీ లీల ఎక్కడ తనను డామినేట్ చేస్తుందో అని కాజల్ భయపడుతుందట. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: