కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న రోజులలో అప్పటి బాలకృష్ణ సినిమాలలో నటించాడు. అప్పటి నుండి బాలయ్య అంటే కళ్యాణ్ రామ్ కు చాల ఇష్టం. కళ్యాణ్ రామ్ నిర్మాతగా మారిన తరువాత తాను ఎప్పటికైనా నందమూరి మల్టీ స్టారర్ ను తీసి ఆసినిమాలో బాలయ్య జూనియర్ లతో తాను కలిసి నటించడం తన డ్రీమ్ అంటూ ఆమధ్య ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు.


సంక్రాంతి సినిమాల హడావిడి తరువాత విడుదలైన చిన్న సినిమాలు అన్నీ ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ధియేటర్లు అన్నీ వెలవెల పోతున్నాయి. దీనితో ఈవారం విడుదల అవుతున్న కళ్యాణ్ ‘అమిగోస్’ తో మళ్ళీ ధియేటర్లకు కళ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి. ‘బింబిసార’ సూపర్ సక్సస్ తరువాత కళ్యాణ్ రామ్ నుండి వస్తున్న మూవీ కావడంతో ఈమూవీ పై అంచనాలు బాగా ఉండటంతో ఈమూవీ బిజినెస్ బాగా జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి.


ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని చెపుతూ ఉంటారు. ఆ పాయింట్ ను ప్రాతిపదికగా తీసుకుని ఒకేలా ఉండే ముగ్గురు చుట్టూ తిరగే ఒక ఇది. మంజునాథ్ సిద్ధార్థ్ మైఖేల్ అన్న మూడు పాత్రలలో ఈమూవీలో కళ్యాణ్ రామ్ కనిపిస్తాడు. ఈమూవీలోని ముగ్గురులో ఒక పాత్ర తనలానే ఉండే మరో ఇద్దరినీ చంపాలని ప్రయత్నిస్తుంది. అలా ఎందుకు జరిగింది అన్నవిషయాన్ని సస్పెన్స్ తో ఈమూవీ కథ నడుస్తుంది అని అంటున్నారు.


లేటెస్ట్ గా జరిగిన ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు జూనియర్ అతిధిగా రావడమే కాకుండా తనదైన రీతిలో ఈమూవీ పై అంచనాలు పెంచుతూ ఈమూవీ కూడ సూపర్ హిట్ అన్న సంకేతాలు తారక్ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈమూవీలో బాలకృష్ణ గతంలో దివ్యభారతి తో కలిసి నటించిన మూవీలోని ఎన్నో రాత్రులు వస్తాయి గానీ పాటను కల్యాణ్ రామ్ తన ‘అమిగోస్’ మూవీ కోసం రీమిక్స్ చేసి తమ నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటే అన్న సంకేతాలు అభిమానులకు ఇస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: