సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కలిసి ఒకే సినిమాలో నటించి ఆ సినిమాతోనే ప్రేమలో పడి వివాహాలు చేసుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అలా చాలామంది సినీ సెలబ్రిటీ తెలుగు సినిమాలలో నటించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని చాలామంది సంతోషంగా ఉన్నారు. అయితే తాజాగా ఇప్పుడు ఆ లిస్టులో మరో బాలీవుడ్ జంట కూడా చేరింది. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సిద్ధార్థ మల్హోత్రా మరియు కియారా ఆద్వానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. 

అయితే ఇప్పటికే వీరిద్దరి పెళ్లికి సంబంధించిన అధికారికి ప్రకటనను కూడా చేయడం జరిగింది. చాలాకాలం డేటింగ్ లో ఉన్న వీళ్ళిద్దరూ మీ అత్తకి లకు పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నారు. ఫిబ్రవరి 4 5 6 తేదీలలో మూడు రోజులపాటు జరగబోయే ఈ పెళ్లి వేడుకలు మెహందీ హళ్లి సంగీత వంటి కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రాజస్థాన్లోని జైసల్మీర్ సూర్యగఢ్ పాలిస్ హోటల్లో వీరిద్దరి పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక ఇంత ఘనంగా నిర్వహించబోతున్న ఈ పెళ్లి వేడుకకు వీరిద్దరూ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అన్న విషయం

 సర్వత్ర ఆసక్తికరంగా మారింది.వీరిద్దరి పెళ్లి ఖర్చు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. ముంబైకి చెందిన ఒక వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ వేడుకలన్నీ ఘనంగా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుకకు గాను ఒక్కరోజుకే దాదాపు రెండు కోట్లకి పైగానే ఖర్చు అవుతుందని తెలుస్తుంది. ఇక మూడు రోజులపాటు జరగబోతున్న ఈ వివాహ వేడుకకు దాదాపు 6 కోట్లకు పైగాని ఖర్చవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతో ఘనంగా జరగబోయే వీరి వివాహ వేడుకకి గాను సినీ తారలతో పాటు చాలామంది ప్రముఖులు కూడా హాజరవుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు వేరే వివాహ వేడుకకి అతిధుల కోసం 70కి పైగానే లగ్జరీ కార్లను కూడా అందుబాటులో ఉంచినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలలో హాజరైనట్టుగా సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: