‘నిన్నే పెళ్ళాడతా’ మూవీ తరువాత దర్శకుడు కృష్ణ వంశీ టాప్ రేంజ్ దర్శకుల లిస్టులో చాలాకాలం కొనసాగుతాడు అని అప్పట్లో భావించారు. అయితే మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కృష్ణ వంశీ తన సినిమాలను తీయలేకపోవడంతో ఇండస్ట్రీలో తన ప్రాభవాన్ని కోల్పోయాడు. ఒకప్పుడు టాప్ హీరోల దర్శకుడుగా కొనసాగిన కృష్ణ వంశీతో ఇప్పుడు సినిమాలు చేయడానికి ఎవరు పెద్దగా ఆశక్తి కనపరచాడంలేదు.

 

 
 ఇలాంటి పరిస్థితులలో ఏదోవిధంగా తిరిగి సెటిల్ కావాలి అన్న ఉద్దేశ్యంతో ఈ దర్శకుడు తీసిన ‘రంగామార్తాండ’ మూవీ విడుదలకు రెడీగా ఉంది. ఈమధ్యనే ఈ మూవీ టీజర్ కు చిరంజీవి వాయస్ ఓవర్ ఇవ్వడంతో తిరిగి ఈమూవీ గురించి ఆశక్తి ప్రారంభం అయింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈమూవీకి సంబంధించిన ఒక మెలోడీ సాంగ్ విడుదల చేసారు. ఈ సాంగ్ కు కుదిరిన రేర్ కాంబినేషన్ టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి కి కృష్ణ వంశీ అంటే విపరీతమైన అభిమానం.

 
  ఆ అనుభంధంతో సిరివెన్నెల జీవించి ఉన్న రోజులలో వ్రాసిన ఒక పాటను ఇప్పుడు విడుదల చేసారు. ఇళయరాజా ట్యూన్ చేసిన ఈపాట మెలోడీ టచ్ తో ఉంది. ‘నన్ను నన్నుగా ఉండనీవుగా ఎందుకంటు నిందలేవీ వెయ్యలేనుగా’ అంటూ సాగే ప్రేమ గీతం ఇది. ఈపాటకు సంబంధించిన ప్రతి పదంలోనూ సిరివెన్నెల మార్క్ కనిపిస్తోంది. ఈపాటకు ట్యూన్ ఇళయరాజా స్టైల్ లో ఉంది.

 

 
 మరీ అటు ఫాస్ట్ గా కాకుండా స్లోగా కాకుండా సాగిన ఈపాటకు సింగర్ రజ‌నీ గాయత్రి స్వరం చక్కగా కుదిరింది. వాస్తవానికి ఈసినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉంది కరోనా వేవ్ ల కారణంగా ఈమూవీ షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు అనేక కారణాలతో ఈమూవీ ఆలస్యం అయింది. ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ లు కలిసి నటిస్తున్న ఈమూవీలో ఒక రంగస్థల కళాకారుడి జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఉంటాయో కంటికి కనిపించేలా కృష్ణ వంశీ చిత్రీకరించాడు అని అంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: