
మెగా మేనల్లుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సాయి ధరమ్ తేజ్ ఇక ఇప్పుడు సుప్రీం హీరోగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇకపోతే ఇటీవల సాయి ధరంతేజ్ కిరణ్... అబ్బవరం హీరోగా నటించిన వినరో భాగ్యం విష్ణు కథ అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే ఈ మెగా హీరో మాట్లాడుతున్న సమయంలో అన్న పెళ్లెప్పుడు అంటూ ఇక అభిమానులందరూ కూడా గోల గోల చేశారు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తేజ్. ఎప్పుడైతే మీరు అమ్మాయిలను గౌరవిస్తారో అప్పుడే నా పెళ్లి అంటూ సమాధానం చెప్పాడు.
అదే సమయంలో ఊరికే ఎక్కడికి వెళ్ళినా పెళ్లి గురించి ఎందుకు అడుగుతున్నారు.. అది ఎప్పుడో అయిపోయింది కదా అంటూ మాట్లాడాడు సాయిధరమ్ తేజ్. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అదేంటి ఎవరికి తెలియకుండా సాయిధరమ్ తేజ్ పెళ్లి చేసుకున్నాడా అని షాక్ లో మునిగిపోయారు. అదేంటి పెళ్లి అయ్యిందా అంటూ అభిమానులు ప్రశ్నించగా అవును అయ్యింది నాలుగు సార్లు అయింది అంటూ నవ్వుకున్నాడు తేజ్. ఇక తర్వాత సర్ సెల్ఫీ ప్లీజ్ అని ఒక మహిళ అభిమాని కోరితే సారీ అమ్మా నాకు ఇప్పటికే పెళ్లయిపోయింది అంటూ మరోసారి నవ్వులు పూయించాడు. అయితే సాయి ధరంతేజ్ ఊరికే అలా అన్నాడా నిజంగానే పెళ్లి అయిపోయిందా అని చర్చ ఇప్పుడు జరుగుతుంది అని చెప్పాలి.