జయం సినిమాతో తెలుగు తెరకీ పరిచయమైన సదా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ సినిమా విజయం అనంతరం ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది సదా. ప్రస్తుతం యంగ్ హీరోయిన్లు వస్తున్న నేపథ్యంలో సదా కి సినిమాల్లో అవకాశాలు తగ్గాయి అని చెప్పాలి.దీంతో కొన్ని రోజులు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది సదా. దాని అనంతరం బుల్లితెరపై ప్రసారమవుతున్న కొన్ని షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం  బుల్లితెర స్టార్ మా లో ప్రసారమయ్యే బేబీ జోడి అనే షోలో హోస్ట్గా వ్యవహరిస్తోంది. ఈ షో లో భాగంగా బిగ్ బాస్ కి చెందిన కంటెస్టెంట్లు  వచ్చి డాన్స్ చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. 

అయితే తాజాగా దీనికి సంబంధించిన ఒక ప్రోమో విడుదలై సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఇందులో ముక్కుఅవినాష్ అరియాన ఇద్దరూ నెల్లూరు నెరజాన అనే పాటకి చాలా రొమాంటిక్గా డాన్స్ చేస్తారు. ఇక ఈ పాటలో వీరిద్దరి డాన్స్ మరియు రొమాన్స్ చూసి అక్కడున్న కంటెస్టెంట్లు మరియు జడ్జీలు అందరూ కూడా షాక్ అవుతారు. అంతేకాదు హీరోయిన్ సదా స్టేజ్ పైకి వచ్చి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే సదాస్ స్టేజ్  పై మాట్లాడుతూ పెళ్ళంటూ చేసుకుంటే నీలాంటి వాడిని చేసుకుంటాను అని అందరి ముందే ముక్కు అవినాష్ కి చెప్పడంతో సదా చెప్పిన మాటలకు ఒకసారి అందరూ షాక్ అవుతారు.

ఈమెతో పాటు తరుణ్ మాస్టర్ కూడా ముక్కు అవినాష్ మరియు అరియాన చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి పేపర్లు కూడా చింపుతాడు. వీరిద్దరితోపాటు అలనాటి హీరోయిన్ రాధ కూడా పెళ్లయిన పది సంవత్సరాల తర్వాత భార్యాభర్తలు ఎలా ఉంటారో మీరు ఇప్పుడు ఆ విధంగానే డాన్స్ చేశారు అంటూ చెబుతుంది. అందరు చివరిలో రాధా మరియు సదా ఇద్దరూ కలిసి అవినాష్ ని మధ్యలో పెట్టుకొని అదే పాటకు అందరూ కలిసి డాన్స్ కూడా వేస్తారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అంతేకాదు ఇక ఇందులో భాగంగానే సదా చేసిన కామెంట్లు విన్న చాలామంది  అవినాష్ లాంటి భర్త మీకు కచ్చితంగా దొరుకుతాడు అంటూ కామెంట్లను చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: