
ఇదిలా ఉండగా తాజాగా గీతా సింగ్ కు సంబంధించిన ఒక విషాద వార్త వెలుగులోకి రావడం గమనార్హం. ఇప్పటికే తన జీవితాన్ని ఎన్నో కష్టాలు పడుతూ నెట్టుకొస్తున్న ఈమె.. తన అన్నయ్య కుమారులను దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. కాగా తాజాగా కర్ణాటకలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది... కియా కారులో ప్రయాణిస్తున్న నలుగురు కూడా యాక్సిడెంట్ లో చనిపోయారు.. ఆ యాక్సిడెంట్ లో చనిపోయింది గీతా సింగ్ పెద్ద కుమారుడు అని వార్తలు వైరల్ అవుతున్నాయి.. కానీ ఇందుకు సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.
కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల వివాహానికి దూరంగా ఉంటూ తన అన్నయ్య కుమారులను దత్తత తీసుకొని వారితోనే ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన గీతా సింగ్ కుమారుడి పేరు.. వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది..క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఈమె ముఖ్యంగా దివంగత దర్శకుడు ఈ వీ వీ సత్యనారాయణ ఈమెకు చాలా అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ముఖ్యంగా తన కొడుకు అల్లరి నరేష్ తో హీరోయిన్గా అవకాశం ఇప్పించి మరింత పెంచారు.. కాకరమైన కొత్త వారు ఇండస్ట్రీలోకి రావడంతో పాత నీరు పోయినట్టు పాత వారికి అవకాశాలు తగ్గిపోయాయి. అలా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న గీతా సింగ్ కి ఇప్పుడు కొడుకు కూడా దూరం అవ్వడం మరింత బాధాకరమని సమాచారం. ఏది ఏమైనా ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.