నందమూరి నటసింహం బాలకృష్ణకి ఇంకా ఆయన అన్న కొడుకు నందమూరి తారకరత్నకు ఉన్న అనుబంధమే వేరు. అబ్బాయ్‌ అంటే బాబాయ్‌కి ఎంతో ప్రేమ. ఆ ప్రేమ కారణంగానే హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు తారకరత్న దగ్గరే బాలయ్య ఉండి అన్నీ తానై చూసుకున్నారు.తారకరత్న కుప్పకూలిన రోజున చెవిలో మృత్యుంజయ మంత్రం కూడా బాలయ్య జపించారు.ఇంకా అలాగే చిత్తూరు జిల్లాలో మృత్యుంజయ అఖండ దీపం కూడా వెలిగించారు బాలయ్య. అలాగే అన్ని దేవుళ్లకు కూడా పూజలు చేయించారు. విదేశాల నుంచి నిపుణులైన డాక్టర్ లని పిలిపించి మరీ చికిత్స చేయించారు.తారకరత్నను బతికించుకునేందుకు ఎన్నో మానవ ప్రయత్నాలు అన్నీ చేశారు బాలయ్య. కానీ అసలు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.బాబాయ్‌ బాలకృష్ణకి అబ్బాయి తారకరత్న మీద ఎంత ప్రేమ ఉందో.. అబ్బాయి తారకరత్నకి బాబాయ్‌ బాలకృష్ణ మీద కూడా అంతే ప్రేమాభిమానాలు ఉన్నాయి. అందుకే బాబాయ్‌ సిగ్నేచర్‌ను తన ఒంటిపై టాటూగా వేయించుకున్నారు తారకరత్న.


పైన సింహం బొమ్మ కింద బాలయ్య సిగ్నేచర్ ఉన్న టాటూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. తారకరత్న చేతిపై నటసింహం పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారంటే తారకరత్న బాలకృష్ణను ఎంతగా ఆరాధించారో వేరే చెప్పక్కర్లేదు. ఇంకా అంతమాత్రమే కాదు.. బాలయ్య ఎలాగైతే తన నాన్నగారి పేరును స్మరిస్తారో.. అలానే తారకరత్న కూడా బాల బాబాయ్.. బాల బాబాయ్ నిత్యం పరితపించేవారని ఆయనతో దగ్గరిగా మెలిగిన సన్నిహితులు ఈ విషయం గురించి చెబుతున్నారు.తారకరత్న చాలా సినిమాలు చేసినా కానీ అందులో ఎక్కువగా ప్లాపులు వున్నాయి. హీరోగా రాణించలేకపోయారు.ఇక ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అనిల్‌ రావిపూడి సినిమా లో విలన్‌గా నటించడానికి అంగీకరించారు తారకరత్న. ఈ మూవీలో కనుక ఆయన నటించి ఉంటే, తారకరత్న కెరీర్‌ ఇంకో రకంగా ఉండేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. గతంలో నారా రోహిత్ నటించిన రాజా చేయి వేస్తే సినిమాలో కూడా ప్రతినాయకుడి పాత్ర పోషించారు నందమూరి తారకరత్న.

మరింత సమాచారం తెలుసుకోండి: