చంద్రమోహన్ రాజేంద్రప్రసాద్ లు తరువాత కామెడీ సినిమాలకు చిరునామాగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరో. అతడితో సినిమా తీస్తే చాల తక్కువ నష్టాలు వస్తాయి అన్నఅభిప్రాయంలో నిర్మాతలు ఉండేవారు. అంతేకాదు ఈవివి సత్యనారాయణ జీవించి ఉన్నంతకాలం ప్రతి సమ్మర్ కు ఒక కామెడీ సూపర్ హిట్ ఇస్తూ తన హవా కొనసాగించాడు.


‘సుడిగాడు’ మూవీ తరువాత నరేష్ కామెడీ పై ప్రేక్షకులకు మొహం మొత్తింది. దీనికి తగ్గట్టుగా ఆతరువాత అతడు నటించిన ‘బందిపోటు’ ‘సెల్ఫీ రాజా’ ‘సిల్లీ ఫెలోస్’ ఇలా అనేక సినిమాలు వరస పరాజయాలు పొందడంతో అతడి మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఆతరువాత వంశీ పైడిపల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో ‘మహర్షి’ మూవీలో చాల గంభీరమైన పాత్ర చేసి మెప్పించినప్పటికీ అతడికి ఆతరువాత హీరోకు అన్న చిన్నాన్న  పాత్రలు రావడంతో తాను అలాంటి పాత్రలు చేయనని చెప్పడంతో అతడికి మరింతగా అవకాశాలు తగ్గాయి అని అంటారు.


ఈపరిస్థితుల మధ్య కొంతకాలం క్రితం ‘నాంది’ హిట్ కావడంతో సీరియస్ కథలను ఎంచుకుని నరేష్ తో సినిమాలు తీస్తే అవి సక్సస్ అవుతాయి అన్న అభిప్రాయానికి వచ్చారు. ఆతరువాత వచ్చిన ‘ఇల్లు మారేడుమిల్లి ప్రజానీకం’ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో మళ్ళీ నరేష్ కెరియర్ కన్ఫ్యూజన్ లో పడింది. ఇలాంటి పరిస్థితులలో ఈ సమ్మర్ రేస్ లో విడుదల కాబోతున్న ‘ఉగ్రం’ మూవీకి సంబంధించిన ట్రైలర్ కు వచ్చిన స్పందన చూసిన వారికి ఈమూవీ ఖచ్చితంగా హిట్ అన్న అభిప్రాయానికి వస్తున్నారు.


అయితే ఈ ట్రైలర్ చూసినవారు వేరొక విధంగా కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్ లో నరేష్ నటించబోయే సినిమాలు అన్నీ ఇలాగే సీరియస్ గా ఉంటాయా ఇక నరేష్ మొఖంలో నవ్వు హాస్యం కనపడవా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. వాస్తవానికి నేటితరం ప్రేక్షకులు కూడ హ్యాస్య సినిమాలను బాగా ఇష్టపడుతున్నారు అన్న విషయాన్ని ‘జాతిరత్నాలు’ సూపర్ సక్సస్ మరొకసారి రుజువు చేసింది. దీనితో నేటితరం ప్రేక్షకులకు అనుగుణంగా ఉండే కామెడీ సినిమాలు వెరైటీ కథలతో నరేష్ ఎందుకు చేయదు అంటూ అతడిని కొందరు ప్రశ్నిస్తున్నారు..





మరింత సమాచారం తెలుసుకోండి: