నాచురల్ స్టార్ నాని ఆఖరుగా అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలు నడుమ విడుదల ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దానితో నాని అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరోత్సాహపరచాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటించాడు.  

మూవీ ని మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని వరల్డ్ వైడ్ గా తెలుగు , తమిళ , మలయాళ , హిందీ , కన్నడ భాషలలో ఒకే రోజు విడుదల చేయనున్నారు. ఈ మూవీ తో శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే నాని ... కీర్తి సురేష్ కాంబినేషన్ లో నేను లోకల్ మూవీ రూపొందింది. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ ని యూఎస్ఏ లో ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ వారు విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సంస్థ ఈ సినిమాను యుఎస్ఏ లో 600 ప్లస్ లొకేషన్ లలో కేవలం తెలుగు భాషలోనే స్క్రీనింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే ఇప్పటి వరకు ఇండియాలో మూడవ హైయెస్ట్ స్క్రీనింగ్ సినిమాగా దసరా యూఎస్ఏ లో విడుదల కాబోతున్నట్లు కూడా ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను మార్చి 29 వ తేదీనే యూఎస్ఏ లో ప్రీమియర్స్ వేయనున్నట్లు ప్రత్యాంగిరా సంస్థ తాజాగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: