సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే యాంకర్ సుమ కచ్చితం గా ఉండాల్సిందే.. తన మాటల తో తన చలాకీ తనం తో ఎలాంటి ఈవెంట్ నైనా కూడా సుమ బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సుమ పై సీరియస్ అయిన సంగతి తెలిసిందే.

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్ లో సుమ ఎన్టీఆర్ ను మాట్లాడమని కోరుతూనే ఎన్టీఆర్ 30 అప్డేట్ గురించి అభి మానులు అడుగు తున్నారు అంటూ కూడా చెప్పింది. దానికి ఎన్టీఆర్ ఓ సీరియస్ లుక్ కూడా ఇచ్చాడు. వాళ్లు కాదు ముందు మీరే అడుగుతున్నారు అని అన్నారు ఎన్టీఆర్ . అయితే సుమ భర్త రాజీవ్ కనకాల కు ఎన్టీఆర్ కు మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే.

తాజా గా విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఎన్టీఆర్ సుమ కు ఫన్నీ కౌంటర్ ను ఇచ్చాడు. ఈ ఈవెంట్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ను ఇన్వైట్ చేస్తున్న సమయం లో ఎన్టీఆర్ ఆమెను చూసి నేను నిను చూడను తల్లీ అంటూ సైగలు కూడా చేశారు.

దానికి వెంటనే సుమ చూడు ఎన్టీఆర్ చూడు అంటూ రియాక్ట్ అయ్యిందటా.. ఈ ఫన్నీ కన్వర్జేషన్ ప్రేక్షకుల ను బాగా ఆకట్టుకుంది. ఇక నిన్న జరిగిన ధమ్కీ ఈవెంట్ లో ఎన్టీఆర్ అద్భుతం గా మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకోవడం గురించి ఆయన బాగా వివరించారు. స్టేజ్ పై చంద్ర బోస్ అలాగే కీరవాణి ఇద్దరు నిలుచుంటే నాకు ఇద్దరు భారతీయులు మాత్రమే కనిపించారు అని చెప్పు కొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: