లాక్ డౌన్ తర్వాత ఎక్కువగా భారతదేశంలో వెబ్ సిరీస్ ల హవా కూడా బాగా పెరిగిపోయింది. దీంతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎంతోమంది స్టార్ పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల దగ్గుబాటి హీరోలు రానా, వెంకటేష్ కలిసి రామానాయుడు అని వెబ్ సిరీస్ లో నటించారు. అమెరికన్ సిరీస్ రేడోనోవన్ అనే వెబ్ సిరిస్ ఆధారణంగా తెరకెక్కించడం జరిగింది.బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ అన్షయాన్, సువర్ణ వర్మ ఈ సిరీస్ ని డైరెక్ట్ చేయడం జరిగింది. ఇక ఇందులో సుశాంత్ సింగ్, చావ్లా, అభిషేక్ బెనర్జీ ,ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రలో నటించారు



ఈనెల 10వ తేదీన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమ్మింగ్ కావడం జరిగింది. టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరో ఇమేజని సొంతం చేసుకున్న వెంకటేష్ ఇందులో నటించడంతో ఈ సిరీస్ లో నటించడానికి ఎక్కువమంది ఆసక్తి చూపించారు. కానీ ఇందులో వెంకటేష్ ఇమేజ్ కి పూర్తిగా విభిన్నంగా ఉందని పలువురు అభిమానులు నేటిజన్లో సైతం తెలియజేయడం జరిగింది. ఇందులో పక్క అడల్ట్ కంటెంట్ తో రామానాయుడు వెబ్ సిరీస్ ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ లో ఈ సిరీస్ పైన అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.
రామానాయుడు ఒక బ్లూ ఫిలిం అంటూ కొంతమంది ప్రముఖులు వ్యాఖ్యానించడం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై లేడీ సూపర్ స్టార్ విజయశాంతి స్పందించడం.. ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (రామానాయుడు) ఓటీటి సిరీస్ పూర్తి మహిళా వ్యతిరేకతో తెరకెక్కించడం జరిగింది. ఈ విషయం గురించి ఇప్పటికే ఎంతోమంది ప్రజలు వ్యతిరేకించి మహిళలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల మనోభావాలను నేను అర్థం చేసుకున్నాను ఇందుకు సంబంధించిన నిర్మాతలు ఓటీటి నుంచి తొలగించాలని కోరుకుంటున్నానని తెలిపింది. భవిష్యత్తులో కూడా దేశవ్యాప్తంగా ఎప్పుడైనా ఇటువంటి ప్రసారాలు ప్రత్యేకించి మహిళల వ్యతిరేకతకు గురయ్యే చిత్రాలు తెరకెక్కించకండి అంటూ తెలిపింది. నటులుగా మనకి ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని, ప్రేమని.. నిలబెట్టుకోవాలంటు తెలిపింది

మరింత సమాచారం తెలుసుకోండి: