ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇది వరకే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన అతడు మరియు ఖలేజా మూవీ లకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ మూవీ పై మహేష్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తూ ఉండగా ... శ్రీ లీల ... పూజా హెగ్డేమూవీ లో హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఈ క్రేజీ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ని కూడా ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ యొక్క షూటింగ్ ను "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ చిత్ర బృందం జరుపుతుంది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ టైటిల్ కు సంబంధించిన అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నట్లు ... ప్రస్తుతం జరుగుతున్న ఈ మూవీ షెడ్యూల్ లో మహేష్ తో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్న మరి కొంత మంది నటీనటులు కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లోని కీలక సన్నివేశాలను ఈ చిత్ర బృందం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: