తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రవిబాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవిబాబు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటుడి గా తన నటన తో మెప్పించి ... ఎన్నో సినిమా లకు దర్శకత్వం వహించి అందులో కొన్ని మూవీ లతో అద్భుతమైన విజయలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని దర్శకుడు గా కూడా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఒకప్పుడు దర్శకుడి గా ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి ఎన్నో విజయాలను అందుకున్న ఈ దర్శకుడు ఈ మధ్య కాలంలో మాత్రం దర్శకుడిగా సరైన విజయాలను అందుకోవడంలో చాలా వరకు విఫలం అవుతున్నాడు. 
\
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు "అసలు" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడింది. అయితే ఈ సినిమాని "ఈటీవీ విన్" "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ యాప్ వారు స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారు. అలాగే ఈ మూవీ అయితే ఈ ఏప్రిల్ 5 తేదీ నుంచి అధికారికంగా  "ఈటీవీ విన్" "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ మూవీ తో అయిన రవిబాబు ప్రేక్షకులను అలరిస్తాడో లేదో చూడాలి. ఇది ఇలా ఉంటే రవిబాబు ఈ మూవీ ని సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందించాడు. ఇది వరకే రవిబాబు ఈ జోనర్ లో కొన్ని సినిమాలను నిర్మించి చాలా సక్సెస్ లను అందుకున్నాడు. మరి ఈ మూవీ తో ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: