ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొంత కాలం క్రితం విడుదల సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న పుష్ప ది రైస్ మూవీ కి కొనసాగింపుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో రెండవ భాగంపై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అలా దేశ వ్యాప్తంగా ఈ మూవీ పై సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ ని నిర్మాతలు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ క్రేజ్ ఉన్న మూవీ కి వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన రెండవ భాగం షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది.

అలాగే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తయింది. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ఇప్పటికే కొన్ని యాక్షన్స్ అన్ని వేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో అల్లు అర్జున్ పుట్టిన రోజు ఉన్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుండి ఏకంగా 3 నిమిషాల యాక్షన్ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రానున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: