ప్రస్తుత కాలంలో థియేటర్లో సినిమాలను చూడటాన్ని జనాలు బాగా తగ్గించేశారు. గొప్ప సినిమా, మంచి సినిమా లేదా పెద్ద స్టార్ హీరో సినిమా వచ్చిందంటే తప్పా జనాలు ఇంట్లోంచి అడుగు బయటకు పెట్టడం లేదు.సినిమా థియేటర్‌కు వెళ్లేందుకు ఖర్చు, ఇక థియేటర్లో పాప్ కార్న్ రేట్లు ఇలా ప్రతీ ఒక్కటి కూడా భారీగా పెరిగిపోయి వారికి చాలా భారంగానే ఉన్నాయి. వాటికి తగ్గట్టు టికెట్ రేట్లు కూడా ఏ విధంగా ఉంటున్నాయో అందరికీ తెలిసిందే. అందుకే జనాలు ఎక్కువగా థియేటర్ మొహాన్ని చూడటానికి ఇష్ట పడటం లేదు. కరోనా వైరస్ తరువాత థియేటర్లకి రావడం పూర్తిగా తగ్గించేసారు. ఇక ఆ సమయంలోనే అందరి ఇళ్లలో టీవీ వినియోగం పెరిగింది.అయితే కేజీయఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా బుల్లితెరపై దారుణమైన రేటింగ్‌లను సాధించింది. ఇక బుల్లితెరపై ఏ సినిమాకు ఎంత రేటింగ్ వస్తుంది? అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. థియేటర్లో ఆడని సినిమాకు బుల్లితెరపై చాలా ఎక్కువ ఆదరణ ఖచ్చితంగా లభిస్తుంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా తెలుగులో హయ్యస్ట్ రేటింగ్స్ సాధించిన సినిమాల లిస్ట్ ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.


టాప్ టీఆర్పీ సాధించిన సినిమాలలో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాను మొదటి సారి ప్రీమియర్‌గా వేసినప్పుడు ఏకంగా 29.40 టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఈ సినిమా వెండితెరపై కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించి యావరేజ్ రేటింగ్స్ తో వన్ మ్యాన్ షోతో అదరగొట్టిన సరిలేరు నీకెవ్వరు సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలు పొందడమే కాకుండా టీఆర్పీ రేటింగ్‌లో కూడా అదరగొట్టి సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఈ సినిమాకు ఏకంగా 23.40 రేటింగ్ వచ్చింది.ఇక ఆ తరువాత ప్రభాస్ బాహుబలి సినిమా 22.70 రేటింగ్ సాధించింది.మళ్ళీ మహేష్‌ బాబు శ్రీమంతుడు సినిమాకు 22.54 రేటింగ్ వచ్చింది. తరువాత బన్నీ పుష్ప సినిమాకు 22.50 రేటింగ్ వచ్చింది. ఇలా మహేష్‌ బాబు, అల్లు అర్జున్ సినిమాలకు ఎక్కువ టాప్ రేటింగ్స్ వచ్చాయి. టాప్ 5లో అయితే ఈ ఇద్దరి హీరోల సినిమాలే రెండేసి చొప్పున ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: