సూపర్ స్టార్ మహేష్ బాబు ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఒక భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా ... ఈ మూవీలో  శ్రీ లీలా ... పూజా  హెగ్డే హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది.

దానితో ఇప్పటి వరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ షూటింగ్ ను "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ ముగిస్తూ వస్తుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మహేష్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఈ మూవీ ని రేపు వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.

అలా ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ ఆడియో రైట్స్ అదిరిపోయే రేంజ్ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ "ఓ టి టి" హక్కులకు కూడా సూపర్ క్రేజీ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ 81 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: